![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో.... సీఐ సీతాకాంత్ ఇంటికి వస్తాడు. తనని చూసి రామలక్ష్మి మైథిలి వేరు వేరు అని చెప్తాడో.. ఒకవేళ మైథిలి రామలక్ష్మిలు ఒకరే అని చెప్తాడో అని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. సీఐ తో రామలక్ష్మి రావడం చూసి ఇంకా టెన్షన్ పడతారు. తను ఎందుకు వస్తుంది. నేనే రామలక్ష్మిని.. వాళ్ళు నన్ను చంపాలని చూసారని చెప్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. రామలక్ష్మి కోపంగా లోపలికి వస్తుంది. రామ్ ఎదరుపడి మేమే వస్తుంటే మీరే వచ్చారని అంటాడు. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని రామ్ ని పంపిస్తుంది.
సీతాకాంత్ గారు అంటు గట్టిగా అరుస్తుంది. సీతాకాంత్ కిందకి వస్తాడు. మీకు ఎంత దైర్యం ఉంటే నాపై ఎంక్వయిరీ చేపిస్తారు. నేను మైథిలినీ కావాలంటే ఇవి చూడండి అంటూ పాస్ పోర్ట్ తను లండన్ లో చదువుకున్న సర్టిఫికెట్ చూపిస్తుంది. అందరు వాటిని చూస్తారు. మీపై పరువు నష్టం దావా వేస్తానని రామలక్ష్మి అనగానే సందీప్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. సీఐ కూడా తను మైథిలీనే అని రామలక్ష్మి కాదని చెప్తాడు. దాంతో సీతాకాంత్ బాధపడతాడు. మీరు ప్రతిసారీ స్కూల్ కీ వచ్చి డిస్టబ్ చేస్తున్నారు.. అందుకే ఇక మీ బాబుకి టీసీ ఇస్తున్నానని రామలక్ష్మి చెప్తుంది. ఆ మాట రామ్ వింటాడు. రామలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతుంది. సీతాకాంత్ షాక్ లోనే ఉండిపోతాడు
రామలక్ష్మి, ఫణీంద్రలు కార్ లో వెళ్తుంటారు. జరిగింది గుర్తు చేసుకొని రామలక్ష్మి బాధపడుతుంది. ఇలా సీతా సర్ కి దగ్గరగా ఉండి దూరంగా ఉండడం నా వళ్ళ కాదు.. నేనొక నిర్ణయం తీసుకున్నానని రామలక్ష్మి అనగానే ఏంటి అది అని ఫణీంద్ర అంటాడు. నేను ఉటీలోని బ్రాంచ్ కి వెళ్లి అక్కడే ఉంటాని రామలక్ష్మి అనగానే.. సరేనని ఫణీంద్ర అంటాడు. దానికి ఏర్పాట్లు చెయ్యండి అని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు రామ్ లేడు అంటూ శ్రీవల్లి అందరితో చెప్పగానే అందరు రామ్ గురించి వెతుకుతారు. గదిలో ఒక మూలాన కూర్చొని ఏడుస్తుంటాడు. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. నువ్వు మిస్ ని ఏదో అన్నావ్.. అందుకే నన్ను స్కూల్ నుండి పంపించిందని రామ్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |